Narayan Jagadeesan
-
కెప్టెన్‌గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్‌కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సుందర్‌కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్‌తో మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. రికార్డుల పృథ్వీ నార్తంప్టన్‌షైర్ జట్టు తరఫున మూడో మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్టులో మాత్రం.. జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ (277; అరుణాచల్‌ప్రదేశ్‌పై 2022లో) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి నో ఛాన్స్! 2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌లో అతడు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 -
IPL 2023: మిస్టర్ ఐపీఎల్ ‘సూపర్‌స్టార్’ లెక్క తప్పింది! వాళ్లను పట్టించుకోనేలేదు!
IPL 2023 Mini Auction- Suresh Raina: ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అంచనా తలకిందులైంది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడతాయంటూ మిస్టర్ ఐపీఎల్ చెప్పిన జోస్యం తప్పింది. రైనా అంచనా వేసిన యువ ఆటగాళ్లలో సౌరాష్ట్ర క్రికెటర్ సమర్థ్ వ్యాస్ తప్ప మిగతా ఇద్దరూ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా ఐపీఎల్ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా షోలో.. ఆక్షన్ ఆరంభానికి ముందు రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన జయదేవ్ ఉనాద్కట్, నారాయణ్ జగదీశన్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయని అతడు పేర్కొన్నాడు. వీళ్ల విషయంలో నిజమైంది అందుకు తగ్గట్లుగానే లక్నో సూపర్ జెయింట్స్ ఉనాద్కట్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేయగా.. నారాయణ్ జగదీశన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ 90 లక్షలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిస్ కోసం పోటీ నెలకొంటుందని రైనా అంచనా వేయగా.. గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. లెక్క తప్పాడు! వీరితో పాటు.. బెన్ స్టోక్స్, సామ్ కరన్ విషయంలో అందరిలానే రైనా అంచనాలూ నిజమయ్యాయి. కానీ అన్క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో మాత్రం మిస్టర్ ఐపీఎల్ లెక్క తప్పింది. జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండర్ ముజ్తాబా యూసఫ్ అమ్ముడుపోకుండా మిగిలి పోయాడు. అంతేగాక ఈ వేలంలో సూపర్‌స్టార్‌గా నిలవగల సత్తా ఉందని రైనా అంచనా వేసిన అల్లా అహ్మద్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మిస్టర్ ఐపీఎల్ జోస్యంపై కామెంట్లు వేలంలో పేరు నమోదు చేసుకున్న అత్యంత పిన్న వయస్కుడైన 15 ఏళ్ల ఈ అఫ్గనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇక సమర్థ్ వ్యాస్‌ను 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రైనా జోస్యంపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాళ్ల విషయంలో మిస్టర్ ఐపీఎల్ అంచనాలు నిజమయ్యాయి. కానీ సూపర్‌స్టార్ అన్న విషయంలో మాత్రం లెక్క తప్పాడు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట Ind Vs Ban: అయ్యో పంత్.. సెంచరీ మిస్! అయితేనేం ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు! సాహా తర్వాత.. -
‘15 ఏళ్ల ఆ అఫ్గన్ బౌలర్ సూపర్‌స్టార్! ఉనాద్కట్‌కు భారీ ధర! ఇంకా..’
IPL 2023 Mini Auction- Watch Out: ఐపీఎల్- 2023 మినీ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆక్షన్‌లో సత్తా చాటగల అన్క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లేనంటూ ముగ్గురు యువ క్రికెటర్ల పేర్లు ప్రస్తావించాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్ సహా అఫ్గన్ యువ కెరటం అల్లా మహ్మద్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు తమ తమ జట్ల తరఫున అద్భుత ప్రదర్శన చేశారని, వేలంలో వీరు మంచి ధర పలకడం ఖాయమని మిస్టర్ ఐపీఎల్ అభిప్రాయపడ్డాడు. కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తంగా 87 బెర్త్‌ల కోసం బరిలో 405 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఉనాద్కట్ ఇంకా.. ఈ మేరకు.. ‘‘భారత క్రికెటర్లలో.. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలిపిన కెప్టెన్, లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్, తమిళనాడు ప్లేయర్ జగదీశన్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. ఆ ఐరిష్ బౌలర్ విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ సహా టీ20 ప్రపంచకప్-2022లో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కోసం పోటీ నెలకొంటుంది. సూపర్‌స్టార్ కాగలడు! అన్క్యాప్డ్ ప్లేయర్లలో ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్, అల్లా మహ్మద్ సత్తా చాటగలరు. నేను ముజ్తాబాతో కలిసి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాను. తను అద్భుతమైన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్. ఇక సౌరాష్ట్ర తరఫున సమర్థ్ వ్యాస్ 150 స్ట్రైక్‌రేటుతో మెరిశాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్-5 బ్యాటర్లలో ఒకడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. ఇక అల్లా మహ్మద్.. ఆరడుగుల మీద రెండు అంగుళాల ఎత్తు ఉండే ఈ 15 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.. సూపర్‌స్టార్ కాగలడు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున ఆడుతున్న ముజ్తాబా యూసఫ్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక సమర్థ్ వ్యాస్.. సౌరాష్ట్ర తరఫున గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అఫ్గనిస్తాన్ యువ సంచలనం 15 ఏళ్ల అల్లా మహ్మద్ అండర్-19 టోర్నీలో(బెస్ట్ 4/15) రాణిస్తున్నాడు. మిస్టర్ ఐపీఎల్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. ఐపీఎల్లో 5528 పరుగులు సాధించాడు. 205 మ్యాచ్‌లలో 136.76 స్ట్రైక్‌రేటుతో ఈ మేరకు రన్స్ చేసి మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందాడు. రైనా ఐపీఎల్ ఖాతాలో ఓ సెంచరీ, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs Ban: టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు.. IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
జగదీశన్ విధ్వంసం.. చెలరేగిన సిద్దార్థ! ఏకంగా 435 పరుగుల తేడాతో..
Vijay Hazare Trophy 2022- Narayan Jagadeesan: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో తమిళనాడు సంచలన విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో సోమవారం తలపడ్డ తమిళనాడు జట్టు ఏకంగా 435 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా లిస్ట్ ‘ఏ’ క్రికెట్(పరిమిత ఓవర్లు)లో అత్యంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఎలైట్ గ్రూప్- సీలో ఉన్న తమిళనాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అరుణాచల్ జట్టుకు తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్, నారయణ్ జగదీశన్ చుక్కలు చూపించారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం సాయి 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు. 277 పరుగులతో రాణించి జట్టు 506 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చెలరేగిన సిద్ధార్థ కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు తమిళనాడు బౌలర్లు. ఓపెనర్లు నీలమ్ ఓబి(4), రోషన్ శర్మ(2)ను సిలంబరసన్ ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపాడు. ఇక తర్వాత సాయి కిషోర్(ఒక వికెట్), సిద్దార్థ్(7.4 ఓవర్లలో 12 మాత్రమే పరుగులు ఇచ్చి 5 వికెట్లు), మహ్మద్(2 వికెట్లు) మిగతా బ్యాటర్ల పనిపట్టారు. 71 పరుగులకే కుప్పకూలిన అరుణాచల్ తమిళనాడు బౌలర్ల విజృంభణతో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దారుణ వైఫల్యం మూటగట్టుకున్నారు. వరుసగా 4, 2, 11, 14, 17, 0, 6, 3(నాటౌట్), 0,0,0 స్కోర్లు నమోదు చేశారు. దీంతో 28. 4 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి అరుణాచల్ జట్టు ఆలౌట్ అయింది. 435 పరుగుల తేడాతో బాబా అపరాజిత్ బృందం జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. సమిష్టి కృషితో సంచలన విజయం అందుకుంది. చదవండి: Narayan Jagadeesan: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..? #Jagadeesan (277) misses out on triple hundred. Gets a big ovation from teammates after world record List A score. @sportstarweb #VijayHazareTrophy2022 pic.twitter.com/s8CKYgUXsc — Ashwin Achal (@AshwinAchal) November 21, 2022 -
ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
తమిళనాడు స్టార్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో నారాయణ్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఇది ఈ టోర్నీలో అతడికి వరుసగా ఐదో సెంచరీ. తద్వారా జగదీశన్ ప్రపంచరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 2014-15 సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఈ రికార్డు ఉంది. తాజా మ్యాచ్‌లో సెంచరీ సాధించిన జగదీశన్ సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 141 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 15 సిక్స్‌లు, 25 ఫోర్లతో 277 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా జగదీశన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లీష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్(268) పేరిట ఉండేది. అదే విధంగా భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రోహిత్ శర్మ(264) రికార్డును జగదీశన్ బ్రేక్ చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించాడు. తమిళనాడు స్కోర్ ఎంతంటే? ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. జగదీశన్‌తో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్(154) పరుగులతో రాణించాడు. లిస్ట్-ఏ క్రికెట్ అంటే? అంతర్జాతీయ వన్డేలతో పాటు దీశీవాళీ వన్డేటోర్నీలు కూడా లిస్ట్-ఏ క్రికెట్ పరిగణలోకి వస్తాయి. లిస్ట్-ఏ క్రికెట్లో ఓవర్ల సంఖ్య నలభై నుంచి అరవై వరకు ఉంటుంది. అదే విధంగా అధికారిక వన్డే హోదాను సాధించని దేశాలు పాల్గొనే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్-ఏ క్రికెట్ పరిగణలోకి వస్తాయి. చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్!