పొట్టి క్రికెట్‌లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్‌కప్-2022 సూపర్-12 మ్యాచ్‌ల్లో భాగంగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 22) జరుగుతున్న మ్యాచ్ ఈ రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రన్ (5/10) ధాటికి 19.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. కర్రన్‌కు జతగా బెన్ స్టోక్స్ (2/19), మార్క్ వుడ్ (2/23), క్రిస్ వోక్స్ (1/24) రాణించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) ఓ మోస్తరుగా రాణించారు.
ప్రపంచ రికార్డు విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్‌ల రూపంలో పెవిలియన్‌కు చేరారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇలా పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. ఇదే ఏడాది క్రెఫెల్డ్ వేదికగా ఆస్ట్రియా-జర్మనీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలిసారి పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లో ఈ సీన్ రెండోసారి రిపీట్ అయ్యింది.
ఇదిలా ఉంటే, 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఫజల్ హాక్ ఫారూఖీ బౌలింగ్‌లో బట్లర్ (18) ఔట్ కాగా.. అలెక్స్ హేల్స్ (11), డేవిడ్ మలాన్ క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment