న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రను చూస్తే సీఎస్‌కే ఎప్పుడూ వేలంలో దూకుడుగా ఉన్న దాఖలాలు లేవని, ఈసారి మాత్రం వారు వేలంలో చాలా యాక్టివ్‌గా ఉండటం ఖాయమని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో వచ్చే ఏడాది వేలానికి ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేసుకుంటుందన్నాడు. వచ్చే ఏడాది కూడా ధోనినే సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నప్పటికీ యువ క్రికెటర్లను ఎక్కువ టార్గెట్ చేస్తూ ఐపీఎల్ వేలానికి వెళతారన్నాడు. వచ్చే ఏడాది సీఎస్‌కే జట్టులో చాలా మార్పులు జరగడం ఖాయమన్నాడు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?)
రిటైన్ కానీ యువ క్రికెటర్లపై సీఎస్‌కే గురిపెడుతుందని గంభీర్ అన్నాడు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న చాలా మందిని తిరిగి రిటైన్ చేసుకుంటుందన్నాడు. ఆ కోవలో ముందు వరుసలో ఉండేవాడు సామ్ కరాన్ అని గంభీర్ తెలిపాడు. సామ్ కరాన్ అద్భుతమైన ఆల్‌రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతను రోజు రోజుకు ఎంతో పరిణితి సాధిస్తూ కీలక ఆల్‌రౌండర్ అవుతాడన్నాడు. టాప్ మోస్ట్ ఆల్‌రౌండర్‌గా సామ్ కరాన్ ఎదుగుతాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్ జోస్యం చెప్పాడు. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 53 బంతుల్లో 72 పరుగులు చేసి విజయానికి బాటలు వేయగా, రవీంద్ర జడేజా జడేజా 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 పరుగులు చేసి అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ సీజన్‌లో చెన్నై ఐదో విజయం సాధించగా, ఓటమితో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు క్లిషంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment