న్యూఢిల్లీ : టెస్ట్ సిరీస్‌లో భారత్ విజయవకాశాలపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ దెబ్బకొట్టాడని టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 4-1తో సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘మేం మరీ దారుణంగా విఫలమవ్వలేదు. కానీ ప్రయత్నించాం. ఇంగ్లండ్ గెలుపు క్రెడిట్ మాత్రం సామ్ కరణ్‌దే. అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు అర్హుడని విరాట్, నేను అనుకున్నాం. ఇంగ్లండ్ కన్నా కరణే మమ్మల్ని దెబ్బతీశాడు. తొలి టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్‌లో క్లిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్‌ను బ్యాట్‌తో రాణించి గట్టెంక్కించాడు. ఇక నాలుగో టెస్ట్‌లో సైతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మా విజయాన్ని లాగేశాడు. కీలక సమయాల్లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో మెరిసాడు. ఇదే ఇరు జట్లలో ఉన్న వ్యత్యాసం. భారత జట్టు ఇంకా ప్రపంచ నెం.1నే. మేం ఎలా పోరాడామో ఇంగ్లండ్‌కు తెలుసు. మీడియాకు తెలుసు. మన అభిమానులకు తెలుసు. మా అంతరాత్మకు కూడా తెలుసు.’ అని వ్యాఖ్యానించాడు.
విమర్శలపై స్పందిస్తూ.. తాము జట్టుకు ఏంచేశామో తమకు తెలుసని, ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ‘ ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మా బాధ్యతలు మాకు తెలుసు. మేం నిజాయితీగానే మా బాధ్యతలు నిర్వర్తించాం. ఈ విమర్శల పట్ల మేం బాధపడటం లేదు. గత మూడేళ్లుగా జట్టు సాధించిన విజయాలేంటో అందరికి తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment