![Ravi Shastri Gets Trolled On Twitter after India Worst Test Defeat against England - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/14/Ravi-Shastri1.jpg.webp?itok=Hnq74-NT)
లండన్: ఇంగ్లండ్‌తో వరుస రెండు టెస్టుల్లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందడంతో కోచ్ రవిశాస్త్రిపై క్రికెట్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. గతంలో భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా సేవలందించి ఆటగాళ్ల మధ్య విభేదాలు సృష్టించిన గ్రెగ్ చాపెల్ కంటే కూడా రవిశాస్త్రి మరింత ప్రమాదకారి అని అభివర్ణిస్తున్నారు. అనుభవజ్ఞుడు, నలుగురి చేత గౌరవించబడే కుంబ్లేను కాదన్నందుకు తగిన ఫలితమే వచ్చిందని ఎత్తిపొడుస్తున్నారు. ప్రపంచ నంబర్‌వన్ టీమిండియా విదేశాల్లో గెలవగలదా అని ప్రశ్నిస్తున్నారు.
భారత జట్టులో ప్రక్షాళన మొదలుపెడితే అది రవిశాస్త్రితోనే మొదలవ్వాలని, కుంబ్లేను మిస్సయ్యామని మరో అభిమాని ట్వీట్ చేశాడు. రవిశాస్త్రి కోచ్ కంటే కూడా భారత జట్టు చీర్ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడని మరొక అభిమాని సెటైర్ వేశాడు. కేవలం కోహ్లిని మాత్రమే ఎప్పుడూ చీర్ అప్ చేస్తూ ఉంటాడన్నాడు. ఈ తరహా లక్షణాలు మాజీ కోచ్ అనిల్ కుంబ్లేలో లేవని సదరు అభిమాని ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తిరిగి ఎలా పుంజుకోవాలని ఆటగాళ్లు అడిగిన సందర్భంలో నిద్రపోతే మంచిదనే అర్థం వచ్చేలా రవిశాస్త్రి కునుకు తీస్తున్న ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment