
ఐపీఎల్-2023లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంతో పంజాబ్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్.. ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
ఇక ఈ పంజాబ్ విజమంలో ఆ జట్టు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. శిఖర్ ధావన్, లైమ్ లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రభ్‌సిమ్రాన్ కేవలం 65 బంతుల్లోనే 10ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు.
పంజాబ్ 161 గౌరవప్రదమైన స్కోరు చేయడంలో ప్రభ్‌సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన ప్రభ్‌సిమ్రాన్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా పంజాబ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవతున్నాడని సెహ్వాగ్ విమర్శించాడు.
కాగా ఐపీఎల్‌లో వేలంలో శామ్ కర్రాన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18. 5 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన శామ్ కర్రాన్ 216 పరుగులతో పాటు కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ప్రభ్‌సిమ్రన్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. పంజాబ్‌కు చాలా బెనిఫిట్ కలుగుతుంది.
ప్రభ్‌సిమ్రన్ తన అరంగేట్ర సీజన్‌లో భారీ మొత్తం (రూ. 4.8 కోట్లు) దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు కేవలం రూ. 60 లక్షలకు మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ తన టాలెంట్ ఎంటో చూపించాడు. అతడికి సెంచరీలు కొట్టగలిగే సత్తా ఉంది అని నిరూపించాడు.
ఇటువంటి యువ ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తుంటే అంతకు మించి ఏమి కావాలి. సామ్ కర్రాన్‌ను 18.5 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగొలు చేసింది. ఏం లాభం. ఒక్క మ్యాచ్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా
𝙋𝙧𝙖𝙗𝙝 𝙧𝙖𝙖𝙠𝙝𝙖 🔥
— JioCinema (@JioCinema) May 13, 2023
Maiden #TATAIPL 💯 for @prabhsimran01 🦁 to give @PunjabKingsIPL an edge in this crucial match!#EveryGameMatters #DCvPBKS #TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/hicf7UINCM