
పుణె: తీవ్ర ఉత్కంఠ రేపిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు విజయం ఇంగ్లండ్‌దా! భారత్‌దా అని ఊగిసలాడింది. ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్ భారత్‌కు చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్‌కు విజయం అందించడానికి కడవరకు పోరాడి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు సామ్ కరన్. అతడి పోరాట పటిమగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
ఈ నిర్ణయం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి షాక్‌కు గురైయ్యాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ..‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా, శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నా...! కానీ అందుకు భిన్నంగా సామ్ కరన్ ఎంపిక ఒకింత విస్మయానికి గురిచేసింది. మిడిల్ ఓవర్స్‌లో బౌలర్లు వికెట్లు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని’ అని పేర్కొన్నాడు. ఇక ప్లేయర్ ‘ఆఫ్ ది సిరీస్’కు భువనేశ్వర్ కుమార్ అర్హుడని కోహ్లి తెలిపాడు. కాగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టోను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక ఓడిపోయిన జట్టుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రావడం చాలా అరుదు. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment