ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ టోర్నీ ఏదైనా తనదైన మార్కు షాట్లతో విరుచుకుపడటం సహజం. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లోనూ అతను అలాంటి ఓ వినూత్న షాట్‌నే ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. స్కూప్ షాట్‌ను రివర్స్‌లో ఉండే ఈ షాట్ ఆడి మ్యాక్సీ బౌండరీ సాధించాడు. ఈ షాట్‌ను చూసి అతని అభిమానులు మ్యాడ్ మ్యాక్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్‌లో ఇదో కొత్త రకం షాట్ అంటూ కితాబునిస్తున్నారు. ఈ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 2) జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ వెరైటీ షాట్‌ను ఆడాడు.
Glenn Maxwell inventing new shots in cricket.
— Johns. (@CricCrazyJohns) January 2, 2024
- The Mad Maxi. 💪💥pic.twitter.com/lTZcdWCA1n
మ్యాచ్ విషయానికొస్తే.. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ 7 వికెట్ల నష్టానికి 97 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఛేదనలో మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో మెల్‌బోర్న్ స్టార్స్ మరో 11 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు థామస్ రోజర్స్ (46 నాటౌట్) రాణించాడు. స్టార్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ లారెన్స్ (7), వెబ్‌స్టర్ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, పీటర్ సిడిల్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు డికాక్ (23), జేక్ ఫ్రేసర్ (14), మెకెంజీ (18), రోజర్స్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయడంతో రెనెగేడ్స్ అతికష్టం మీద 97 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రాణించిన మ్యాక్సీ బంతితోనూ (3-0-8-1) సత్తా చాటాడు. స్టార్స్ బౌలర్లలో డేనియల్ లారెన్స్ 2, జోయెల్ పారిస్, ఇమాద్ వసీం, స్టీకిటీ, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment