టెస్టు క్రికెట్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై సత్తాచాటిన జైశ్వాల్.. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై తను ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో యశస్వీ అద్బుతమైన సెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అలోవకగా ఎదుర్కొంటూ దిగ్గజాలను సైతం జైశ్వాల్ ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో జైశ్వాల్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ 40కి పైగా టెస్టు సెంచరీలు సాధిస్తాడని మాక్సీ జోస్యం చెప్పాడు.
"జైశ్వాల్ ఒక అద్బుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్‌లో నలభై కంటే ఎక్కువ సెంచరీలు చేసే సత్తా అతడికి ఉంది. విభిన్న రికార్డులను తిరిగి రాస్తాడని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ జైశ్వాల్ దగ్గర ఉంది.
ఈ సిరీస్‌లో రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని మా బౌలర్లు అడ్డుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. జైశ్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుంది. అన్ని రకాల షాట్లు ఆడగలడు. స్పిన్ కూడా బాగా ఆడగలడు. అతడొక ఫుల్ ప్యాకెజ్ ప్లేయర్" అని గ్రేడ్ క్రికెటర్ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్‌వెల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment