
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ మరో విజయాన్నినమోదు చేసింది. ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. కాగా ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో థర్డ్ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించాడు.
అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులతో పాట్నర్‌షిప్‌తో అదరగొట్టారు.
2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించగా.. చెన్నైతో మ్యాచ్‌లో డుప్లెసిస్(62), మ్యాక్సీ(77) ఆ రికార్డును బ్రేక్ చేశారు. తాజాగా తమ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టారు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన ఈ 127 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ హిస్టరీలో 15వ అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. మూడో వికెట్‌కు మాత్రం ఇదే అత్యుత్తమం.
ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టి20 క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటికే నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన డుప్లీ.. తాజాగా ఐదో అర్ధశతకాన్ని అందుకున్నాడు. పలితంగా పొట్టి ఫార్మాట్‌లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment