ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ టి20 ప్రపంచకప్‌లో తొలిసారి మెరిశాడు. గత 27 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్థసెంచరీ సాధించని మ్యాక్సీ ఎట్టకేలకు శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కీలక హాఫ్ సెంచరీతో రాణించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 బంతుల్లో ఫిప్టీ మార్క్ అందుకున్న మ్యాక్సీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 32 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. ఇక మిగిలిన వారిలో మిచెల్ మార్ష్ 45, స్టోయినిస్, వార్నర్‌లు 25 పరుగులు చేశారు.
ఇప్పటికే గ్రూఫ్-1 నుంచి న్యూజిలాండ్ సెమీస్‌కు చేరడంతో మరో బెర్తు కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంకలు పోటీ పడుతున్నాయి. అయితే ఆసీస్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న ఇంగ్లండ్ శ్రీలంకపై నెగ్గితే ఏడు పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. ఇక ఆసీస్ నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉండడంతో అఫ్గాన్‌పై భారీ విజయం అవసరం ఉంది. అలా కాకుండా శ్రీలంక చేతిలో ఇంగ్లండ్ ఓడితే మాత్రం అప్పుడు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది.
చదవండి: అతడిని తప్పించారా? టీమ్ బస్సు మిస్ అయ్యాడా? నాకేం అర్థం కావడం లేదు!
Comments
Please login to add a commentAdd a comment