'అవును మేమింతే' అంటున్న కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ | Virat Kohli-Glenn Maxwell Play Rock-paper-scissors Game PBKS Takes DRS | Sakshi
Sakshi News home page

Kohli-Maxwell: 'అవును మేమింతే' అంటున్న కోహ్లి, మ్యాక్స్‌వెల్‌

Published Fri, Apr 21 2023 6:45 PM | Last Updated on Fri, Apr 21 2023 6:55 PM

Virat Kohli-Glenn Maxwell Play Rock-paper-scissors Game PBKS Takes DRS - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 24 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు కోహ్లి స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మాములుగానే యాక్టివ్‌గా కనిపించే కోహ్లి ఇక కెప్టెన్‌ పాత్రలో ఉంటే అతన్ని తట్టుకోవడం కష్టం. పంజాబ్‌తో మ్యాచ్‌లో దూకుడుగా కనిపించాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా వచ్చిన విరాట్‌ ఆద్యంతం హైపర్‌ యాక్టివ్‌గా ఉన్నాడు. 

అయితే పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఎల్బీ విషయంలో పంజాబ్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ రివ్యూ తీసుకున్నాడు. ఈ సమయంలో కోహ్లి, మ్యాక్స్‌వెల్‌లు మాత్రం తమకేమి పట్టనట్లుగా రాక్‌ పేపర్‌ సిసర్స్‌(Rock Paper Scissors) గేమ్‌ ఆడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. మా కోహ్లి అంతేలే.. ఒక కెప్టెన్‌గా జట్టును నడిపించడంతో పాటు ఇలా ఎంటర్‌టైన్‌ కూడా చేయగలడు అంటూ కామెంట్‌ చేశారు.

ఇక పంజాబ్‌తో మ్యాచ్ లో డుప్లెసిస్‌ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక మ్యాచ్‌లో తొలుత  బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ కోహ్లి, డుప్లెసిస్‌ దూకుడుతో 174 రన్స్ చేయగా.. తర్వాత పంజాబ్ కింగ్స్ 150 పరుగులకే పరిమితమైంది. సిరాజ్ 4 వికెట్లతో పంజాబ్‌ పతనాన్ని శాసించాడు. కాగా 84 పరుగులు చేసిన డుప్లెసిస్‌ ఆరెంజ్ క్యాప్ లిస్టులో టాప్ లోకి దూసుకెళ్లగా.. సిరాజ్ పర్పుల్ క్యాప్‌ రేసులో టాప్‌కు చేరుకున్నాడు. ఇలా ఏకకాలంలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌ రేస్‌లో టాప్‌లో ఉండడం అరుదుగా కనిపిస్తుంది.

చదవండి: 'రెండు' దేశాల క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. బ్రాడ్‌మన్‌తో పోల్చిన వైనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement