డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 మధ్య మెగా ఈవెంట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘దిస్ ఈజ్ బిగ్ టైమ్’’ పేరిట ప్రమోషన్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
‘‘ఇంత పెద్దగా ఉన్న గ్లెన్ మాక్స్‌వెల్‌ను మీరెప్పుడైనా చూశారా? ప్రముఖ ఆటగాళ్లు... పెద్ద జట్లు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆడటానికి ఆస్ట్రేలియాకు వస్తున్నాయి’’ అని ఇన్‌స్టాలో క్యాప్షన్ జతచేసింది. ఇందులో జంబో మాక్సీ ఆసీస్ జెర్సీలో బ్యాట్ చేతబట్టి వీధుల్లోకి రాగా భూకంపం వచ్చినంత పనవుతుంది. అందరూ అతడిని ఆశ్చర్యంగా చూస్తారు.
ఇక బిగ్గెస్ట్ స్టార్స్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ సహా పలు జట్ల ఆటగాళ్లను ఇందులో చూడవచ్చు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘భయ్యా ఇప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లి కాదు!’’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇందుకు బదులుగా.. ‘‘అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినా, రెండేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా.. భారత జెర్సీలో కోహ్లి కనిపించాడంటే ఆ కిక్కే వేరు! తన బ్రాండ్ వాల్యూ అలాంటిది మరి! తగ్గేదేలే’’ అంటూ కింగ్ కోహ్లి ఫ్యాన్స్ దీటుగా సమాధానమిస్తున్నారు.
ఇదిలా ఉంటే... ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ ఇప్పటికే వరస విజయాలతో సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ తొలి స్థానంలో నిలిచాడు. రోహిత్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. అయినా కీలక ఆటగాళ్లు అని మెన్షన్ చేశారే తప్ప కెప్టెన్లను కాదని పేర్కొంటున్నారు.
చదవండి: Ind Vs Sl 3rd T20: ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం.. ఇక: రోహిత్ శర్మ
Rohit Sharma: రోహిత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేటపుడు జాగ్రత్త.. పట్టిందల్లా బంగారమే: టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment