IPL 2022 RCB Organize Glenn Maxwell Wedding Party, Kohli Dance For Pushpa Song - Sakshi
Sakshi News home page

Virat Kohli Dance: మాక్సీ వెడ్డింగ్‌ పార్టీ.. జోష్‌గా స్టెప్పులేసిన కోహ్లి.. ఫొటోలు, వీడియోలు వైరల్‌!

Published Thu, Apr 28 2022 12:12 PM | Last Updated on Thu, Apr 28 2022 3:24 PM

IPL 2022 RCB Organize Glenn Maxwell Wedding Party Kohli Shakes Leg Viral - Sakshi

మాక్స్‌వెల్‌ వెడ్డింగ్‌ పార్టీ(PC: Instagram)

IPL 2022- Glenn Maxwell Wedding Party Pics Viral: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న టీ20 లీగ్‌. స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా ఆటగాళ్లందరినీ అందరినీ ఒక్క చోట చేర్చి వినోదం పంచే వేదిక.

ఇక జట్టు ఏదైనా క్రికెటర్లు కేవలం ఆటకు మాత్రమే పరిమితం కారు.. బంధాలు, అనుబంధాలు పెనవేసుకుంటూ.. ఒక కుటుంబంలా చక్కగా కలిసిపోయి ఒకరికొకరు అన్నట్లు స్నేహబంధాన్ని పెంపొందించుకుంటారు. సహచరుల పుట్టినరోజు, పెళ్లి రోజు.. వేడుక ఏదైనా అంతా కలిసి సరదాగా గడుపుతారు. 

ఇటీవల చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ఆటగాడు డెవాన్‌ కాన్వే(న్యూజిలాండ్‌) ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా ఆటగాళ్లంతా భారత సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సైతం తమ స్టార్‌ ఆల్‌రౌండర్‌, కొత్త పెళ్లి కొడుకు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కోసం పార్టీ ఏర్పాటు చేసింది. భారత మూలాలున్న వినీ రామన్‌ను పెళ్లాడి మాక్సీ తమిళనాడు అల్లుడైన విషయం తెలిసిందే. వీరి వివాహం జరిగి నెల రోజులు పూర్తైన సందర్భంగా ఆర్సీబీ బుధవారం(ఏప్రిల్‌ 27) ఫంక్షన్‌ చేసింది. 

బయో బబుల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు ఆర్సీబీ ఆటగాళ్లంతా హాజరయ్యారు. విరాట్‌ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి పార్టీకి విచ్చేశాడు. అంతేకాదు భాషా, ప్రాంతీయ బేధాలనేవి లేకుండా సినీ ప్రేమికులను ఉర్రూతలూగించిన పుష్ప సినిమాలోని సమంత పాట ఊ అంటావా మావాకు కోహ్లి స్టెప్పులేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఆట విషయానికొస్తే.. ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో ఐదింట విజయం సాధించి ఆర్సీబీ 10 పాయింట్లతో టాప్‌-5లో కొనసాగుతోంది. కోహ్లి మాత్రం ఇంతవరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక విమర్శల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తొలగించాలంటూ కొంతమంది నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి👉🏾Umran Malik: అతడిని వీలైనంత త్వరగా టీమిండియాకు సెలక్ట్‌ చేసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement