Travis Head Injury: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. సౌతాఫ్రికాతో నాలుగో వన్డే సందర్భంగా అతడి ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే హెడ్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు
ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇలా కీలక బ్యాటర్ గాయపడటం ఆసీస్‌ను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ గాయం గురించి ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అప్‌డేట్ ఇస్తూ.. ‘‘ఫ్రాక్చర్ అయిన మాట వాస్తవమే. అయితే, హెడ్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం.
ఇప్పటికే నలుగురు స్టార్లకు గాయాలు
స్కానింగ్ తర్వాతే గాయం తీవ్రత గురించి తెలుస్తుంది. ప్రపంచకప్‌నకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇలా జరగడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్టార్లు ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న వేళ హెడ్ గాయంతో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలినట్లయింది.
అదొక్కటే కాస్త ఊరట
కాగా కమిన్స్‌కు మణికట్టు భాగంలో ఫ్రాక్చర్ అయింది. స్టార్క్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. మాక్స్‌వెల్‌కు మడిమ నొప్పితో సతమతమవుతున్నాడు. అయితే, స్టీవ్ స్మిత్ మణికట్టు గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా.. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
అయితే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా గాయపడిన ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోలుకుని వైద్య బృందం పరీక్షల్లో పాస్ కావడం ఆస్ట్రేలియాకు కాస్త ఊరట కలిగించింది.
గాయాల బెడద.. మాజీ చాంపియన్ ఏం చేస్తుందో?
ఇక భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు జట్లకు అవకాశం ఉంది. ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో.. వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని అత్యధికంగా 5 సార్లు గెలిచిన ఆసీస్ ఈసారి టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి!
ప్రపంచకప్-2023కి ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆష్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment