CWC 2023- Australia vs Bangladesh: వన్డే వరల్డ్‌కప్-2023 లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. పుణె వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా.. తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కంగారూ జట్టు సారథి ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు.
అందుకే వాళ్లిద్దరికి రెస్ట్
‘‘పొద్దు పొద్దున్నే బౌలింగ్ చేయడం మాకు అనుకూలిస్తుందనుకుంటున్నాం. బంతి బాగా స్వింగ్ అవుతుంది. కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నాం. తుదిజట్టులో రెండు మార్పులు చేశాం. మాక్స్‌వెల్, స్టార్క్‌లకు విశ్రాంతినిచ్చాం. సెమీస్‌లో వారిద్దరి పాత్ర కీలకం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం.
స్మిత్, అబాట్ జట్టులోకివచ్చారు. అబాట్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఇప్పటి వరకు మేము మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేదు. ఈ మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో రాణించాలనుకుంటున్నాం’’ అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అజేయ డబుల్ సెంచరీతో సెమీస్ చేర్చి
అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో గ్లెన్ మాక్స్‌వెల్ అజేయ డబుల్ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించి.. సెమీస్ చేర్చాడు. అంతకు ముందు తలకు తగిలిన గాయం కారణంగా జట్టుకు దూరమైన మాక్సీ.. క్రీజులో కదల్లేని స్థితిలో ఉన్నా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వహ్వా అనిపించాడు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో అతడికి రెస్ట్ ఇచ్చింది యాజమాన్యం. ఇక అనారోగ్య సమస్యలతో అఫ్గన్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టీవ్ స్మిత్ అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు.
మరోవైపు.. ప్రపంచకప్-2023లో అన్నింటికంటే ముందే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్.. తమ ఆఖరి మ్యాచ్‌లో పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో నజ్ముల్ హుసేన్ షాంటో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
తుదిజట్లు:
ఆస్ట్రేలియా
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హాజిల్‌వుడ్.
బంగ్లాదేశ్
తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్( వికెట్ కీపర్), తౌహిద్ హృదోయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
చదవండి: CWC 2023- Semis: ఏమైనా జరగొచ్చు.. మేమింకా రేసులోనే ఉన్నాం.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment