ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (PC: CA)
Australia 15 Man Squad For WC 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ఆస్ట్రేలియా తమ జట్టును ఖరారు చేసింది. ఐసీసీ ఈవెంట్‌లో భాగం కానున్న 15 మంది సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. ప్రాథమిక జట్టులో.. తొలిసారిగా చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ ఆర్డోన్ హార్డీ, తన్వీర్ సంఘాకు మొండిచేయి ఎదురైంది.
అతడు కూడా అవుట్
అదే విధంగా.. యువ పేసర్ నాథన్ ఎల్లిస్‌కు కూడా చోటు దక్కకపోగా... రైట్ ఆర్మ్ పేసర్ సీన్ అబాట్ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టెస్టు స్పెషలిస్టు మార్నస్ లబుషేన్ పేరును ఈసారి కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ మూడే మార్పులు
ఎల్లిస్, తన్వీర్, హార్డీ.. ఈ ముగ్గురు తప్ప ప్రిలిమినరీ జట్టులో చోటు దక్కించుకున్న వాళ్లంతా ఫైనల్ టీమ్‌లో స్థానం సంపాదించారు. ఇదిలా ఉంటే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్‌లేమితో సతమతం కావడం మాజీ చాంపియన్‌ను కంగారుపెడుతోంది.
కెప్టెన్ సహా వాళ్లంతా
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెగా ఈవెంట్‌కు ఇంకా సమయం ఉందని.. అప్పటికి తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామని పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు సౌతాఫ్రికా, టీమిండియా(సెప్టెంబరు 22-27)తో తాము ఎనిమిది వన్డేలు ఆడటం సానుకూలాంశమన్న బెయిలి.. కీలక టోర్నీకి ముందు ఈ సిరీస్‌లు తమకు సన్నాహకాలుగా ఉపయోగపడుతాయని హర్షం వ్యక్తం చేశాడు.
అప్పటిదాకా టైమ్ ఉంది.. కాబట్టి
కాగా 15 మంది సభ్యుల జట్టులో ప్రధాన వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ ఉండగా.. అతడికి బ్యాకప్‌గా జోష్ ఇంగ్లిస్‌కు స్థానం దక్కింది. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మెగా ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు జట్లకు అవకాశం ఉంది. కాబట్టి ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్ల స్థానంలో వేరే వాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలిచిన విషయం తెలిసిందే.
వరల్డ్‌కప్-2023కి ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆష్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
చదవండి: WC Team India: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్..
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
— Cricket Australia (@CricketAus) September 6, 2023
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi
Comments
Please login to add a commentAdd a comment