pic credit: IPL twitter
IPL 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 115 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్స్ ఏకంగా మైదానం బయటకు వెళ్లి పడింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న జనాలంతా అవాక్కయ్యారు. బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి డుప్లెసిస్ ఈ మాన్‌స్టర్ సిక్సర్‌ను కొట్టాడు.
𝗖𝗼𝗺𝗺𝗮𝗻𝗱𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 becomes 𝗪𝗿𝗲𝗰𝗸𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 🔥#RCBvLSG #TATAIPL #IPL2023 pic.twitter.com/KK5ZqpUmNl
— JioCinema (@JioCinema) April 10, 2023
ఐపీఎల్-2023లో ఇదే అత్యంత భారీ సిక్సర్ కాగా.. ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో ఇది 10వ భారీ సిక్సర్‌గా నమోదైంది. ఐపీఎల్ అరంగేట్రం సీజన్ (2008)లో సీఎస్‌కే ఆటగాడు ఆల్బీ మోర్కెల్ బాదిన 125 మీటర్ల భారీ సిక్సర్ ఇప్పటివరకు లాంగెస్ట్ సిక్సర్‌గా చలామణి అవుతుంది. దీని తర్వాత 2013లో పంజాబ్ ఆటగాడు ప్రవీణ్ కుమార్ 124 మీటర్ల సిక్సర్ కొట్టగా.. 2011లో గిల్‌క్రిస్ట్ 122 మీటర్లు, 2010లో ఉతప్ప 120 మీటర్లు, 2013 గేల్ 119, 2009లో యువరాజ్ 119, 2008లో రాస్ టేలర్ 119, 2016లో బెన్ కట్టింగ్ 117, 2013లో గంభీర్ 117 మీటర్ల సిక్సర్ కొట్టాడు.
115M SIX FROM @faf1307 🤯
— CricTracker (@Cricketracker) April 10, 2023
📸: Jio Cinema pic.twitter.com/VOREXEPgJt
కాగా, లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ ఈ ఒక్క సిక్సర్‌తోనే సరిపెట్టుకోలేదు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 5 భారీ సిక్సర్లు బాదాడు. అతనితో పోటాపోటీగా మ్యాక్స్‌వెల్ 6, కోహ్లి 4 సిక్సర్లు కొట్టారు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) స్కోర్ చేయగా.. అమిత్ మిశ్రా, మార్క్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment