RCB Vs LSG: RCB Lost 5 Matches After Scoring 200 Plus, Most By Any Team In IPL History - Sakshi
Sakshi News home page

IPL 2023 RCB VS LSG: అట్లుంటది ఆర్సీబీ గ్రహచారం.. ఎంత చేసినా అంతే, చెత్త రికార్డు

Published Tue, Apr 11 2023 1:00 PM | Last Updated on Tue, Apr 11 2023 1:38 PM

RCB Lost 5 Matches After Scoring 200 Plus, Most By Any Team In IPL - Sakshi

pic credit: IPL twitter

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత దురదృష్టమై జట్టు ఏదైనా ఉందా అంటే అది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరేనని చెప్పాలి. ఆరంభ సీజన్‌ నుంచి జట్టు నిండా దిగ్గజాలు ఉన్నా ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క టైటిల్‌ కూడా సాధించలేదు. ప్రతి ఏడాది 'ఈ సాలా కప్‌ నమదే' (ఈ ఏడాది కప్‌ మనదే) అని ఫ్యాన్స్‌ను ఊరించే ఈ జట్టు.. ప్రతి యేడు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఉసూరుమనిపిస్తుంది.

ఈ టీమ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సందర్భాల్లో అతి భారీ లక్ష్యాలను తృణప్రాయంగా ఛేదిస్తుంది. కొన్ని సందర్భాల్లో అత్యంత పేలవమైన ఆటతీరుతో దారుణంగా నిరాశపరుస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో తొలుత బ్యాటింగ్‌ చేసి అత్యంత భారీ స్కోర్లు చేసే ఈ జట్టు, వాటిని డిఫెండ్‌ చేసుకోలేక చతికిలపడుతుంది. ఇలాంటి ఘటనే ఐపీఎల్‌-2023లో నిన్న జరిగింది.

తమకు అచ్చొచ్చిన చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగుల భారీ లక్ష్యాన్ని డుప్లెసిస్‌ సేన డిఫెండ్‌ చేసుకోలేక ఓటమిపాలైంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించి, ఆర్సీబీ దృరదృష్టాన్ని మరోసారి గుర్తు చేసింది. థ్రిల్లర్‌ సినిమాను తలపించిన ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆర్సీబీ తమ దురదృష్టాన్ని మరింత మెరుగుపర్చుకుంది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ స్కోర్‌ చేసి దాన్ని డిఫెండ్‌ చేసుకోలే చతికిలపడిన దురదృష్ట జట్టుగా రికార్డుల్లో నిలిచింది. ఆర్సీబీ ఇప్పటివరకు 5 సందర్భాల్లో 200 ప్లస్‌ స్కోర్‌ చేసి దాన్ని డిఫెండ్‌ చేసుకోలేక ఓటమిపాలైంది. ఐపీఎల్‌లో మరే జట్టు ఇన్ని సార్లు ఇలా ఓటమిపాలవలేదు. ఆర్సీబీ తర్వాత సీఎస్‌కే 3 సార్లు, పంజాబ్‌, కేకేఆర్‌ తలో 2 సార్లు 200 ప్లస్‌ స్కోర్‌ను నిలువరించుకోలేపోయాయి. 

ఇదిలా ఉంటే, నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో వికెట్‌ తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్‌ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన లక్నో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా.. తొలుత స్టోయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత  పూరన్‌ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఆఖర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ ఇన్నింగ్స్‌ చివరి బంతికి బై రావడంతో లక్నో వికెట్‌ తేడాతో విజయం సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement