WC 2023- #AUSvsNED- #GlennMaxwellFastestCentury: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.
ఏకంగా 252.50 స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ప్రపంచకప్-2023లో ఢిల్లీలోనే మార్కరమ్ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే.
వరల్డ్‌కప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలు(ఎదుర్కొన్న బంతుల పరంగా) నమోదు చేసింది వీరే
►40 - గ్లెన్ మాక్స్‌వెల్ నెదర్లాండ్స్ మీద, ఢిల్లీలో-2023
►49 - ఎయిడెన్ మార్కరమ్ శ్రీలంక మీద, ఢిల్లీలో- 2023
►50 - కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్ మీద, బెంగళూరులో- 2011
►51 -గ్లెన్ మాక్స్‌వెల్ శ్రీలంక మీద, సిడ్నీలో- 2015
►52 - ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్ మీద, సిడ్నీలో 2015
ఆస్ట్రేలియా భారీ స్కోరు:
నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 104 , స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టగా.. మాక్సీ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యాన్ని విధించింది.
Comments
Please login to add a commentAdd a comment