
మాక్స్‌వెల్ (PC: IPL/BCCI)
IPL 2023- RCB- Glenn Maxwell: స్వదేశంలో టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్. మెల్‌బోర్న్‌లో బర్త్‌డే పార్టీకి వెళ్లిన సమయంలో యాక్సిడెంట్‌కు గురైన మాక్సీ ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. సర్జరీ అనంతరం చాలా కాలం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. ఇటీవల టీమిండియాతో వన్డే సిరీస్‌లోనూ భాగమయ్యాడు.
ఇక ఇప్పుడు ఐపీఎల్-2023కి కూడా మాక్స్‌వెల్ అందుబాటులోకి వచ్చాడు. అయితే, తను గాయం నుంచి పూర్తి కోలుకోలేదంటూ బాంబు పేల్చాడీ ఆసీస్ ఆల్‌రౌండర్. ‘‘పర్లేదు కాళ్లు బాగానే ఉన్నాయి. అయితే వందశాతం ఫిట్‌నెస్ సాధించాలంటే ఇంకొన్ని నెలలు పడుతుంది. ఏదేమైనా అంతా సజావుగా సాగి.. టోర్నమెంట్ మొత్తం బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆర్సీబీ సొంతమైదానం (బెంగళూరు)లో ఆడనుండటం సంతోషంగా ఉందన్న మాక్స్‌వెల్.. త్వరలోనే చిన్నస్వామి స్టేడియంలో కలుస్తానంటూ ఫ్యాన్స్‌ను చీర్ చేశాడు. కాగా 2022 సీజన్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ 13 మ్యాచ్‌లలో 301 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక గత సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌నకు చేరిన విషయం తెలిసిందే.
ఇక ఈసారి కూడా మాక్సీ మెరుపులు చూడాలని ఆశపడుతున్న అభిమానులను.. మాక్స్‌వెల్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన వెంటాడుతోంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ జట్టుతో చేరిన మాక్స్‌వెల్ ప్రస్తుతం తన ప్రాక్టీసు కొనసాగిస్తున్నాడు. ఇక టీమిండియాతో వన్డే సిరీస్‌లో మాక్స్‌వెల్‌కు ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 8 పరుగులు చేశాడు.
చదవండి: NZ Vs SL: వారెవ్వా షిప్లే.. దెబ్బకు వికెట్ ఎగిరి అంతదూరాన పడింది! షాక్‌లో నిసాంక! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment