విరాట్ కోహ్లి- శుబ్‌మన్ గిల్ (PC: IPL/BCCI)
IPL 2023- RCB- Virat Kohli: ‘‘సీజన్‌లో కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. నిరాశ కలిగించే విషయమే. కానీ మనం తలెత్తుకోవాలి. ఈ ప్రయాణంలో అడుగడుగునా.. మాకు అన్ని విధాలా అండగా నిలిచిన విశ్వసనీయమైన మద్దతుదారులకు, అభిమానులకు రుణపడి ఉంటాం’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు.
12th మ్యాన్ ఆర్మీకి, మేనేజ్‌మెంట్, కోచ్‌లకు ధన్యవాదాలు చెబుతూ థాంక్యూ నోట్ షేర్ చేశాడు. ఐపీఎల్-2023లో లీగ్ దశలోనే ఆర్సీబీ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలై ఇంటిబాట పట్టింది బెంగళూరు జట్టు.
భంగపాటు తప్పలేదు
ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాట్ ఝులిపించినా ఫలితం లేకుండా పోయింది. అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించిన కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన కారణంగా ఆర్సీబీ ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.
కోహ్లి పోస్ట్‌కు బదులిచ్చిన గిల్
ఈసారైనా కప్ మనదే అని ఆశలు పెంచుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌కు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులను ఉద్దేశించి మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశాడు. వచ్చే సీజన్‌లో మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తామని పేర్కొన్నాడు.
PC: Virat Kohli
ఇక ఇందుకు స్పందించిన శుబ్‌మన్ గిల్.. ‘‘కింగ్’’ అన్నట్లు ఎమోజీలతో కోహ్లికి బదులిచ్చాడు. కాగా గిల్ కారణంగానే ఆర్సీబీ ఓడిందని కొంతమంది ఫ్యాన్స్ అతడిని, అతడి సోదరిని దారుణంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కోహ్లి ట్వీట్‌కు గిల్ బదులిచ్చిన తీరు ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సీజన్‌లో బ్యాటర్‌గా కోహ్లి మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆడిన 14 ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 639 పరుగులు చేశాడు.
కేజీఎఫ్ రాణించినా
ఇక ఆఖరి రెండు మ్యాచ్‌లలో కోహ్లి వరుస శతకాలు సాధించాడు విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 100 పరుగులు చేసిన కింగ్.. గుజరాత్ టైటాన్స్‌పై 101 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోరు. అదే విధంగా ఈ ఎడిషన్‌లో కోహ్లి సాధించిన అర్ధ శతకాల సంఖ్య 6.
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో లీగ్ దశ ముగిసేనాటికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. 14 ఇన్నింగ్స్‌లలో కలిపి 730 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉండగా.. అతడి అత్యధిక స్కోరు 84.
కారణమెవరు?
ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లితో పాటు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సైతం ఈసారి మెరుగైన ప్రదర్శన చేశాడు. 14 ఇన్నింగ్స్ ఆడి 400 పరుగులు సాధించాడు. ఇలా ‘కేజీఎఫ్’ రూపంలో పటిష్టమైన బ్యాటర్లు దొరికినా.. బౌలింగ్ వైఫల్యాలు, కీలక సమయంలో ఆటగాళ్ల తప్పిదాలు ఆర్సీబీ ఓటములకు కారణమయ్యాయి. దీంతో మరోసారి నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం కోహ్లి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు అభిమానులను మరింతగా బాధించాయి.
చదవండి: పతిరణపై ధోని కామెంట్లు! మండిపడ్డ మలింగ.. ఎంఎస్ కరెక్ట్ అన్న లంక మరో పేసర్!
A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way. pic.twitter.com/82O4WHJbbn
— Virat Kohli (@imVkohli) May 23, 2023
Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Comments
Please login to add a commentAdd a comment