IPL 2023 RCB Vs GT: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, అతడి సోదరి షానిల్ గిల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. షానిల్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ప్రత్యర్థి జట్టు ఓడిపోయినందుకు అతడి సోదరిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఆర్సీబీ ఓడిపోవడంతో
కాగా ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో మెరిసినా.. లక్ష్య ఛేదనలో గిల్ శతకంతో రాణించి గుజరాత్‌ను గెలిపించాడు.
దీంతో ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఓటమిని జీర్ణించుకోలేని కొందరు ‘దురభిమానులు’ శుబ్‌మన్ గిల్‌తో పాటు అతడి సోదరి షానిల్‌ను కూడా టార్గెట్ చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
స్వాతి మలివాల్ ఆగ్రహం.. ఇది నిజంగా సిగ్గుచేటు
ఈ విషయంపై స్పందించిన స్వాతి మలివాల్.. గిల్, షానిల్‌లపై వస్తున్న ట్రోల్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లు చూసిన ఓ మ్యాచ్‌లో తమకిష్టమైన జట్టు ఓడిపోయిందని శుబ్‌మన్ గిల్ సోదరిని అబ్యూజ్ చేయడం నిజంగా సిగ్గుచేటు.
చర్యలు తీసుకుంటాం
గతంలో విరాట్ కోహ్లి కూతురి పట్ల కూడా ఇలాగే ప్రవర్తించారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఇలాంటివి చూస్తూ ఊరుకోదు. గిల్ సోదరిని కించపరిచేలా మాట్లాడిన వాళ్లపై తప్పక చర్యలు తీసుకుంటాం’’ అని ట్విటర్ వేదిగా పేర్కొన్నారు.
కాగా డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వాలిఫైయర్-1లో సీఎస్‌కేతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్‌లో శుబ్‌మన్ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండు సెంచరీలు సాధించిన ఈ యువ ఓపెనర్.. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లలో కలిపి 680 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్
IPL 2023 CSK Vs GT Probable Playing XI: ‘ఫైనల్’కు ముందెవరు?
Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Extremely shameful to see trollers abusing #ShubhmanGill’s sister just because the team they follow lost a match. Previously we had initiated action against people abusing #ViratKohli daughter. DCW will take action against all those who have abused Gill’s sister as well. This… pic.twitter.com/eteGtGgPVm
— Swati Maliwal (@SwatiJaiHind) May 22, 2023
Comments
Please login to add a commentAdd a comment