సోదరి షానిల్‌తో శుబ్‌మన్ గిల్
IPL 2023- RCB Vs GT- Virat Kohli- Shubman Gill: ఒకరిపై అభిమానం హద్దులు దాటి.. మరొకరిపై ద్వేషంగా మారితే.. అటువంటి వాళ్లను ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి తాము దైవంగా భావించే వ్యక్తులు కూడా ఇష్టపడరు. దిగజారుడు వ్యాఖ్యలతో ఎదుటివాళ్లను కించపరిస్తే అస్సలు సహించరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు నెటిజన్లు.
అభిమానం ఉండాలి గానీ.. అది ఎదుటివాళ్ల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది.
కోహ్లి సెంచరీ వృథా.. ఆర్సీబీ అవుట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 197 పరుగులు స్కోరు చేసింది.
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీ(101) కారణంగా గుజరాత్‌కు 198 పరుగుల భారీ లక్ష్యం విధించగలిగింది. టార్గెట్ ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
గిల్ సిక్సర్ల వర్షం
52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడి 104 పరుగులు సాధించాడు. కోహ్లి మాదిరే ఈ సీజన్‌లో రెండో శతకం నమోదు చేశాడు. గిల్ అజేయ సెంచరీతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
మరోవైపు.. ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కావడం ఫ్యాన్స్ మదిని మెలిపెట్టింది. ఈసారైనా ట్రోఫీ గెలుస్తారనుకుంటే.. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటూ ఉసూరుమన్నారు.
గిల్‌తో పాటు అతడి సోదరిని కూడా దారుణంగా
ఈ నేపథ్యంలో కొంతమంది ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్‌తో పాటు అతడి సోదరి షానిల్ గిల్‌ను కూడా సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. గిల్‌కు ఏదైనా అపాయం జరగాలని కొంతమంది కోరుకుంటుండగా.. షానిల్‌ను ఉద్దేశించి మరికొందరు రాయలేని పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు.
కుటుంబంతో శుబ్‌మన్ గిల్
వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదు! కోహ్లి ఫ్యాన్స్ అసలే కాదు!
అయితే, ఆర్సీబీ ‘అభిమానులం’దరూ అలాగే చేస్తున్నారనుకుంటే పొరపాటే! నిజమైన ఫ్యాన్స్ మాత్రం.. ‘‘కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయిందన్న బాధ ఉంది. నిజానికి.. శుబ్‌మన్ ఆడిన తీరును కూడా మేము ఆస్వాదించాం. ఆర్సీబీ ఓడినంత మాత్రాన గిల్‌ను, అతడి సోదరిని విమర్శించే వాళ్లు నిజమైన అభిమానులు అనిపించుకోరు.
కాస్త సంయమనం పాటించండి’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా గతంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచినందుకు కోహ్లిని సైతం ఇలాగే కొంతమంది దారుణంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి అయితే ఏకంగా కోహ్లి చిన్నారి కూతురు వామికను ఉద్దేశించి అత్యాచార బెదిరింపులకు పాల్పడి జైలు పాలయ్యాడు.
కాస్తైనా సిగ్గుపడండి!
తాజాగా గిల్, అతడి సోదరిపై ట్రోల్స్ వస్తున్న తరుణంలో.. మ్యాచ్ అనంతరం కోహ్లి.. గిల్‌ను ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఇద్దరూ హీరోలే. ఆటలో గెలుపోటములు సహజం. మీరెందుకు అనవసరంగా కొట్టుకుంటారు. కోహ్లి, గిల్ ఇద్దరూ రేపు టీమిండియాకు కలిసే ఆడతారు కదా! పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్లు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. కాస్తైనా సిగ్గుపడండి’’ అంటూ ట్రోలర్స్‌కు గడ్డి పెడుతున్నారు.
చదవండి: IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వివరాలు ఇవే
ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు
Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Comments
Please login to add a commentAdd a comment