సౌరవ్ గంగూలీ- విరాట్ కోహ్లి (PC: IPL)
Virat Kohli- Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లి అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎదుటి వాళ్లకు ఇంగ్లిష్ అర్థంకాకపోతే అది తన సమస్య కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఆర్సీబీ అలా అవుట్ అయింది
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కోహ్లి అజేయ సెంచరీ కారణంగా 197 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో గిల్ విజృంభించడంతో ఆర్సీబీకి కష్టాలు తప్పలేదు. అద్భుత సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు గిల్.
దీంతో ఆర్సీబీ నిరాశగా ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదు కావడంతో అభిమానులకు కావాల్సినంత వినోదం దొరికింది. కోహ్లి, శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ క్రమంలో గంగూలీ చేసిన ట్వీట్ కోహ్లి ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.
గిల్‌ను మెచ్చుకుంటూ దాదా ట్వీట్
ఆర్సీబీ- గుజరాత్ మ్యాచ్ అనంతరం దాదా స్పందిస్తూ.. ‘‘దేశం ఆణిముత్యం లాంటి ఆటగాడిని అందించింది.. ప్రతిభ గల ఆ క్రికెటర్.. శుబ్‌మన్ గిల్.. రెండు అద్భుత ఇన్నింగ్స్.. ఐపీఎల్.. క్యాష్ రిచ్ లీగ్ ప్రమాణాలు ఏ స్థాయికి చేరుకున్నాయో!?’’ అని ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు.
కోహ్లి ఫ్యాన్స్ ఆగ్రహం
కాగా ఐపీఎల్-2023లో గిల్ రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా కోహ్లి కూడా వరుస శతకాలు సాధించాడు. కానీ తన ట్వీట్‌లో గంగూలీ.. కోహ్లి పేరు ప్రస్తావించకపోవడంతో అభిమానులు దాదాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీంతో గంగూలీ సైతం ఘాటుగా స్పందించాడు.
మీకు ఇంగ్లిష్ రాకపోతే.. వెళ్లి
‘‘మీకోసం ఓ రిమైండర్.. నా ట్వీట్‌పై రాద్ధాంతం చేస్తున్నవాళ్లు ముందు ఇంగ్లిష్ అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దానికి నేను బాధ్యుడిని కాదు.. ఎవరో ఒకరిని వివరించమని అడగండి’’ అంటూ దాదా మరో ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో కోహ్లి టీమిండియా సారథిగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఇప్పటికీ కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది.
చదవండి: ఛీ.. అపార్థం చేసుకున్నావు! ధోనిని అవమానించావు.. నీకేం తక్కువ చేశాం?
లక్నోతో కీలక పోరు.. ముంబై జట్టులోకి యువ స్పిన్నర్! విధ్వంసకర ఓపెనర్ కూడా
What talent this country produces .. shubman gill .. wow .. two stunning knocks in two halves .. IPL.. .. what standards in the tournament @bcci
— Sourav Ganguly (@SGanguly99) May 21, 2023
Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Comments
Please login to add a commentAdd a comment