PC: IPL.com
ఐపీఎల్-2023 ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలని గుజరాత్ భావిస్తుంటే.. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ఐదోసారి ట్రోఫిని ముద్దాడాలని యోచిస్తుంది.
ఇక ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గిల్ 123 పరుగులు చేస్తే.. ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కింగ్ కోహ్లిని అధిగమిస్తాడు. ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో 4 హాఫ్ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. కాగా అంతకుముందు 2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లి 973 పరుగులు చేసి ఈ రికార్డు కలిగి ఉన్నాడు. ఆ ఏడాది సీజన్‌లో 7 హాఫ్ సెంచరీలతో పాటు 4 సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో కోహ్లి అద్భుతంగా రాణించాడు. ఓవరాల్‌గా 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 6 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలతో పాటు 639 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2023: ఒక వేళ వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment