IPL 2022: Glenn Maxwell Tamil wedding Trending on Social Media - Sakshi
Sakshi News home page

Glenn Maxwell: తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌

Published Mon, Mar 28 2022 7:02 PM | Last Updated on Mon, Mar 28 2022 7:38 PM

Maxwell Tamil Wedding Trending In Social Media - Sakshi

Maxwell Tamil Wedding: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన ప్రేయసి విని రామన్‌ను ఈ నెల 18న క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట మరోసారి భారతీయ (తమిళ) సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. మార్చి 27న జరిగిన ఈ కార్యక్రమం అతికొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. ఈ వివాహ కార్యక్రయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. 


ఇందులో మ్యాక్స్‌వెల్ షేర్వాణీలో, విని రామన్‌ చీర కట్టుకుని కనిపించారు. మ్యాక్స్‌వెల్ పెళ్లి చేసుకున్న విని రామన్‌ తమిళ అమ్మాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే, మ్యాక్సీ ప్రస్తుతం​పాకిస్థాన్‌ టూర్‌లో ఉండాల్సి ఉండింది. అయితే పెళ్లి కారణంగా అతను పాక్‌ పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఇక, ఐపీఎల్‌ విషయానికొస్తే.. మ్యాక్సీ లేకపోవడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు పెద్ద లోటేనని చెప్పాలి. ఐపీఎల్‌ వర్గాల సమాచారం మేరకు అతను ఏప్రిల్ 5 తర్వాత ఆర్సీబీ శిబిరంలో చేరతాడు.
చదవండి: IPL 2022: డబ్బు డిమాండ్‌ చేసానన్నది అవాస్తవం.. ఆర్సీబీపై చహల్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement