
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తిలక్ వర్మను మెరుపు వేగంతో రనౌట్ చేశాడు. దీంతో మ్యాక్సీ ఘనంగా ఎంట్రీ ఇస్తే.. పాపం తిలక్ వర్మ లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఆకాశ్ దీప్ వేశాడు. అప్పటికే ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన ఆకాశ్ దీప్ ఓవర్‌లో ఐదో బంతిని వేశాడు.
తిలక్ వర్మ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అక్కడ ఉంది మ్యాక్స్‌వెల్ అన్న విషయం మరిచిపోయిన తిలక్ వర్మ.. సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. సూర్య స్పందించడంతో తిలక్ వర్మ పరిగెత్తాడు. అంతే బంతిని అందుకున్న మ్యాక్స్‌వెల్ మెరుపు వేగంతో డైవ్ చేస్తూ డైరెక్ట్ త్రో విసిరాడు. తిలక్ వర్మ క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేయడంతో క్లియర్ రనౌట్ అని తేలింది.
ఆర్‌సీబీలో సంబరాలు మొదలు కాగా.. ముంబై నిరాశలో కూరుకుపోయింది. ఏదైతేనేం.. మ్యాక్స్‌వెల్ మాత్రం సూపర్ ఎంట్రీతో మెరిశాడు. మ్యాక్సీ తిలక్ వర్మను ఔట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''అక్కడ ఉంది ఎవరు.. మ్యాక్స్‌వెల్.. అట్లనే ఉంటది మరి.. పాపం తిలక్ వర్మ ఊహించి ఉండడు'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.
మ్యాక్స్‌వెల్ మెరుపు రనౌట్ కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: 12 ఏళ్ల క్రితం ఇలాగే.. సేమ్ సీన్ రిపీట్ అయ్యేనా!
Comments
Please login to add a commentAdd a comment