Courtesy: IPL Twitter
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మను దురదృష్టం వెంటాడింది. సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. మ్యాచ్‌లో 20 బంతుల్లో 36 పరుగులతో తిలక్ వర్మ మంచి టచ్‌లో కనిపించాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ల అర్ష్‌దీప్ వేసిన ఐదో బంతిని సూర్యకుమార్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు.. అయితే అప్పటికే సూర్య క్రీజు నుంచి కదలడంతో రన్‌కు కాల్ చేశాడని భావించిన తిలక్ వర్మ వేగంగా పరిగెత్తాడు.
అయితే బంతి అందుకున్న మయాంక్ అర్ష్‌దీప్‌కు త్రో విసిరాడు. అప్పటికే సగం క్రీజు దాటిన తిలక్ వెనక్కి వచ్చినప్పటికి లాభం లేకుండా పోయింది. అర్ష్‌దీప్ వికెట్లను గిరాటేయడంతో తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇది చూసిన అభిమానులు.. దీనిలో సూర్య తప్పు లేదు.. తిలక్ వర్మ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోయేది.. దురదృష్టం తిలక్ వర్మదే అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: IPL 2022: రోహిత్ శర్మ కొత్త చరిత్ర.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment