
Courtesy: IPL Twitter
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఈ దెబ్బకు కోహ్లి రనౌట్ గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. చహల్ వేసిన బంతిని డేవిడ్ విల్లీ డిఫెన్స్ ఆడాడు. కానీ కోహ్లి ఇది గమనించకుండానే సగం క్రీజు వరకు పరిగెత్తుకొచ్చాడు. ఇది చూసిన కీపర్ సంజూ శాంసన్ మెరుపు వేగంతో పరిగెత్తి బంతిని బులెట్ వేగంతో చహల్ వైపు త్రో విసిరాడు. సకాలంలో స్పందించిన చహల్ కోహ్లి క్రీజులోకి రాకముందే బెయిల్స్‌ను పడగొట్టాడు.
Courtesy: IPL Twitter
అయితే ఇక్కడ కోహ్లి బద్దకం స్పష్టంగా కనిపించిది. కాస్త వేగంగా పరిగెత్తి ఉంటే కోహ్లి రనౌట్ నుంచి తప్పించుకునేవాడు. చహల్ బెయిల్స్ ఎగురగొట్టే సమయంలో కోహ్లి బ్యాట్ క్రీజుకు ఇంచు దూరంలో ఉండిపోయింది. కేవలం తన నిర్లక్ష్యం కారణంగా అనవసరంగా వికెట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. '' కోహ్లి ఎందుకంత బద్దకం.. కాస్త వేగంగా పరిగెత్తి ఉంటే బాగుండేది కదా..'' అని కామెంట్ చేశారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బట్లర్ 70 నాటౌట్, హెట్‌మైర్ 42 నాటౌట్ రాణించారు.
కోహ్లి రనౌట్ వీడియో కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022 RR Vs RCB: కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్