Kashmiri Artist Makes 3D Portrait of Virat Kohli and Anushka Sharma - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఎంత అందంగా గీశాడో.. కోహ్లి, అనుష్కల మతి పోవాల్సిందే!

Published Fri, Apr 8 2022 6:36 PM | Last Updated on Fri, Apr 8 2022 7:39 PM

IPL 2022 Kashmiri Artist Makes 3-D Portrait Virat Kohli-Anushka Sharma - Sakshi

విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ.. చూడముచ్చటైన జంట. ఒకరు క్రికెట్‌లో ఆధిప​త్యం చెలాయిస్తుంటే.. మరొకరు సినీ రంగంలో పేరు సంపాదించారు. 2013 నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ ఇద్దరు 2017లో వివాహం చేసుకున్నారు. వీరి బంధానికి గుర్తుగా గతేడాది జనవరిలో వామికా పుట్టింది. ప్రస్తుతం ఈ జంట మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో ఒకరిగా ఉన్నారు. అంత అందమైన జంట కాబట్టే.. కశ్మీర్‌కు చెందిన షబ్బీర్‌ అహ్మద్‌.. 'విరుష్క దంపతుల అందమైన త్రీడీ పెయింటింగ్‌ వేశాడు.


ఒకవేళ విరాట్‌, అనుష్కలు చూస్తే కచ్చితంగా ఫ్లాట్‌ అవుతారు.. అంత అందంగా ఉంది మరి. జమ్మూలోని బషోలి ఆర్ట్‌ గ్యాలరీలో షబ్బీర్‌ అలీ ఈ పెయింటింగ్‌ను గీశాడు. ఇది గీయడానికి దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్నాడట. షబ్బీర్‌ పెయింటింగ్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నప్పటికి అతనికి మాత్రం ఆనందం లేదంట. ఎందుకంటే కోహ్లిని షబ్బీర్‌ ఎంతగానో ఆరాధిస్తాడు. '' ఒకసారి నేను గీసిన పెయింటింగ్‌ను కోహ్లి, అనుష్కలు చూడాలి.. అప్పుడే నా మనసుకు తృప్తి ఉంటుంది. అంతేకాదు వారిద్దరు దీనిని చూస్తే మాకు ఎంకరేజ్‌ చేసినట్లు అవుతుంది.. ఎందుకంటే మా నాన్నకు కోహ్లి బ్యాటింగ్‌ అంటే చాలా ఇష్టం. సచిన్‌ తర్వాత అంతటి పేరు సంపాదించిన కోహ్లి అంటే నాకు ఇష్టమే. ఇంత కష్టపడి గీసిన పెయింటింగ్‌ కోహ్లి వద్దకు చేరితే నాకు గుర్తింపు వస్తుంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా విరాట్‌, అనుష్కల త్రీడీ పెయింటింగ్‌కు సంబంధించిన వీడియోను మోసిన్‌ కమల్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.''ఏదో ఒకరోజు కోహ్లి .. కచ్చితంగా షబ్బీర్‌ పెయింటింగ్‌ను చూస్తాడని.. అతన్ని కలుస్తాడని'' పేర్కొన్నాడు. కాగా కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌ 2022లో బిజగా ఉన్నాడు. కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్న కోహ్లి.. ఆర్‌సీబీలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్‌ ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

చదవండి: ఎంత అందంగా గీశాడో.. కోహ్లి, అనుష్కల మతి పోవాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement