
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హార్దిక్ బులెట్ వేగంతో వేసిన త్రో దెబ్బకు మిడిల్ స్టంప్ వికెట్ రెండు ముక్కలయింది. పాండ్యా బులెట్ వేగానికి సంజూ శాంసన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఫెర్గూసన్ వేసిన ఓవర్ మూడో బంతిని శాంసన్ మిడాఫ్ దిశగా ఆడాడు. సింగిల్ రిస్క్ అని తెలిసినప్పటికి శాంసన్ అవనసరంగా పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న పాండ్యా మెరుపు వేగంతో డైరెక్ట్ త్రో వేశాడు. శాంసన్ సగం క్రీజు దాటి వచ్చేలోపే బంతి వికెట్లను గిరాటేయడంతో క్లియర్ రనౌట్ అని తేలింది.
అయితే పాండ్యా బంతిని ఎంత బలంతో త్రో విసిరాడో తర్వాతి సెకన్‌లోనే అర్థమైంది. అతని దెబ్బకు మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యి బయటికి వచ్చేసింది. శాంసన్‌ను రనౌట్ చేసిన తీరు కంటే ఇది హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు పాండ్యా చేయి పడితే అంతే.. వికెట్ అయినా విరిగిపోవాల్సిందే.. ఏమా వేగం అంటూ కామెంట్స్ చేశారు. అంతకముందు పాండ్యా బ్యాటింగ్‌లోనూ ఇరగదీశాడు. 52 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.
హార్దిక్ పాండ్యా బులెట్ త్రో కోసం క్లిక్ చేయండి
Hardik Pandya breaks the stumps. #IPL20222 #GTvsRR pic.twitter.com/VNcU6uswuT
— Cricketupdates (@Cricupdates2022) April 14, 2022
Comments
Please login to add a commentAdd a comment