పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్ ఓవర్ ఆఖరి బంతికి పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. హర్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేశాడు. హార్దిక్ వేసిన ఆఖరి బంతిని అర్ష్‌దీప్ సింగ్ డీప్‌మిడ్ వికెట్ మీదుగా ఆడాడు. అయితే బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ ఉండడంతో రెండో పరుగు తీయడమే కష్టం.. కానీ రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సక్సెస్ అయ్యారు.
అయితే ఫీల్డర్ కీపర్ వైపు త్రో వేయడం అది మిస్ కావడంతో మూడో రన్ కోసం పరిగెత్తారు. అయితే ఈజీగా రనౌట్ చేసే అవకాశాన్ని హార్దిక్ జారవిడిచాడు. బంతి చేతిలోకి రాకముందే అతని పాదం వికెట్లకు తగిలింది. దీంతో బంతి అందుకొని కొట్టేలోపే రెండు బెయిల్స్ కిందపడిపోయాయి. ఎటు తేల్చుకోలేని అంపైర్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు.
రిప్లేలో హార్దిక్ బంతి రాకముందే కాలితో వికెట్లను తన్నడం కనిపించింది. ఆ తర్వాత కూడా బంతితో వికెట్లను ఎక్కడా తాకించినట్లు అనిపించలేదు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. హార్దిక్ చర్యకు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కూడా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: 'కొంచెం జాగ్రత్తగా ఉంటే వేరుగా ఉండేది.. తప్పు చేశావ్'
— Sam (@sam1998011) April 8, 2022
Comments
Please login to add a commentAdd a comment