PC:IPL.com
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ గాయం కారణంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజగా అతడి గాయంపై సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫన్ ఫ్లేమింగ్ స్పందించాడు. అతడు గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి చేరడానికి మరో వారం రోజులు పడుతుందని ఫ్లేమింగ్ తెలిపాడు. ఏప్రిల్ 23న జరిగిన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ట్రైనింగ్ సెషన్‌లో అలీ గాయపడ్డాడు.
"మొయిన్ అలీ చీలమండకు గాయమైంది. అయితే అదృష్టవశాత్తూ.. ఎక్స్‌రేలో ఎలాంటి ఫ్రాక్చర్ లేదని తేలింది. అయితే అతడికి వారం రోజులు పాటు విశ్రాంతి అవసరం. ఎలాంటి ఫ్రాక్చర్ లేనందున త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము" అని ఫ్లెమింగ్ సోమవారం మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు పేసర్లు దీపక్ చాహర్, ఆడమ్ మిల్నే ఐపీఎల్-2022 సీజన్‌కు దూరమయ్యారు. ఇక పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందింది.
చదవండి: IPL 2022: "ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం నా కల.. ఈ సారి అస్సలు వదులుకోను"
Comments
Please login to add a commentAdd a comment