
Tom Latham Was 2nd Batsman Thrice Overturning OUT Decision In Innings.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో నానాకష్టాలు పడ్డారు. రెండోరోజు ఆటను కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ముగించింది. అంతకముందు 345 పరుగుల వద్ద టీమిండియాను ఆలౌట్ చేసిన కివీస్ ఓవరాల్‌గా రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రివ్య్వూలు కూడా టీమిండియాకు అనుకూలంగా రాలేదు.
ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా బౌలర్లు టామ్ లాథమ్‌ను మూడుసార్లు ఔట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూడుసార్లు రివ్య్వూకు వెళ్లిన లాథమ్‌కే అనుకూలంగా వచ్చింది. అలా టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో మూడుసార్లు రివ్యూలో సక్సెస్ సాధించిన రెండో బ్యాటర్‌గా లాథమ్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీ.. 2016-17లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఔట్‌పై మూడుసార్లు రివ్యూ కోరి సక్సెస్ అయిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కాగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 3, 15, 56వ ఓవర్‌లో టీమిండియా బౌలర్లు ఎల్బీ విషయంలో అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ మూడుసార్లు ఔట్ ఇచ్చాడు. అయితే ప్రతీసారి రివ్యూకు వెళ్లగా మూడుసార్లు లాథమ్ నాటౌట్ అని తేలింది.
చదవండి: Ravindra Jadeja: క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు
Comments
Please login to add a commentAdd a comment