ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకీ ఐసీసీ బిగ్‌షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ను ఉల్లంఘించినందుకు మొయిన్ అలీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని అలీ ఉల్లంఘించినట్లు ఐసీసీ ఓ ప్రకనటలో పేర్కొంది. అదే విధంగా అతడికి ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.
అలీ ఏం చేశాడంటే?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 89 ఓవర్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అలీ.. డ్రెయింగ్ ఏజెంట్‌తో తన చేతిపై స్ప్రే చేయించుకున్నాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే అంపైర్‌లు ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు విధించారు.
వారి అనుమతి లేకుంగా చేతికి ఎటువంటి క్రీమ్‌లు గానీ స్ప్రేలు గాని చేయకూడదు. కానీ అలీ అంపైర్‌ల రూల్స్‌ను అతిక్రమించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా యాషెస్ తొలి టెస్టుతోనే అలీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: Ashes 2023: మెయిన్ అలీ సూపర్ డెలివరీ.. బిత్తిరి పోయిన గ్రీన్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment