మొయిన్ అలీ(PC: ECB)
England Tour Of Pakistan 2022: పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ టూర్‌కు దూరమయ్యాడు. హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు పిక్కల్లో గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో పాక్ పర్యటనకు కూడా దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ మొయిన్ అలీ.. బట్లర్ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ పాక్‌లో పర్యటించనుంది.
టెస్టు సిరీస్ సైతం..
2005 తర్వాత సెప్టెంబరులో తొలిసారిగా పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 2 వరకు టీ20 సిరీస్ ఆడనుంది. మొదటి ఆరు మ్యాచ్‌లు కరాచీ వేదికగా జరుగనుండగా.. ఆఖరి టీ20కి లాహోర్ వేదిక కానుంది. ఈ టూర్ ముగిసిన తర్వాత డిసెంబరులో మరోసారి టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ మరోసారి పాక్ పర్యటనకు వెళ్లనుంది.
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు టెస్టులు ఆడనుంది. రావల్పిండి, ముల్తాన్, కరాచీలలో డిసెంబరు 1 నుంచి 21 వరకు ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ జరుగనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జాకిర్ ఖాన్ ధ్రువీకరించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో మొయిన్ అలీ మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి: Rishabh Pant: జట్టులో పంత్‌కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు!
Hardik Pandya: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన హార్దిక్.. కెరీర్ బెస్ట్... ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment