IPL 2022 Auction: CSK To Retain These 4 Players Check Full Details Here In Telugu - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction- CSK: రైనాను పక్కనపెట్టేశారు.. చెన్నై రీటైన్‌ చేసుకునేది, విడుదల చేసేది వీళ్లనే!

Published Tue, Nov 30 2021 11:05 AM | Last Updated on Tue, Nov 30 2021 2:30 PM

IPL 2022 Auction: CSK To Retain These 4 Players Check Full Details Here - Sakshi

PC: IPL

IPL 2022 Auction: CSK To Retain These 4 Players Check Full Details Here: ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌-2021 సీజన్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నిర్ణయం తీసుకుం‍ది. జట్టును నాలుగుసార్లు విజేతగా నిలిపిన కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీలను రీటైన్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక డ్వేన్‌ బ్రావో, ఫాఫ్‌ డు ప్లెసిస్‌, సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, సురేశ్‌ రైనాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 16 ఇన్నింగ్స్‌లో 635 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు.

ఇక మరో ఓపెనర్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ సైతం 633 పరుగులతో రాణించినప్పటికీ విదేశీ ఆటగాళ్ల కోటాలో ఫ్రాంఛైజీ.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ వైపే మొగ్గు చూపడం విశేషం. కాగా రీటైన్‌ జాబితాను సమర్పించేందుకు తుది గడువు నవంబరు 30 అన్న సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్‌ అనౌన్స్‌మెంట్‌’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement