
మొయిన్ అలీకి ఐసీసీ హెచ్చరిక
ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజా ప్రజలకు మద్దతుగా ‘సేవ్ గాజా అండ్ ఫ్రీ పాలస్తీనా’ పేరిట చేతికి బ్యాండ్ ధరించి... భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు ఆడడమే దీనికి కారణం.
సౌతాంప్టన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజా ప్రజలకు మద్దతుగా ‘సేవ్ గాజా అండ్ ఫ్రీ పాలస్తీనా’ పేరిట చేతికి బ్యాండ్ ధరించి... భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు ఆడడమే దీనికి కారణం.
ఐసీసీ నిబంధనల మేరకు ఏ ఆటగాడు కూడా ఎలాంటి మత పరమైన, రాజకీయపరమైన సందేశాలను ప్రదర్శించకూడదు. అందుకే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో మరోసారి ఇలా ప్రవర్తించకూడదని హెచ్చరించింది. అయితే అలీపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని తెలిపింది. సోమవారం ఆటలో అలీ చేతికి ఈ బ్యాండ్ కనిపించింది.