ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ జట్టు నుంచి తప్పుకున్న అనంతరం మెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అలీ ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి రెండు సార్లు రిటైర్ అయ్యి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కే గుడ్‌బై చెప్పాలని అతడు డిసైడ్ అయ్యాడు. డైలీ మెయిల్‌లో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్‌తో మెయిన్ మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించాడు. జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ తెలిపాడు.
"నేను అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ స్ధాయిలో నేను మళ్లీ ఇంగ్లండ్‌కు ఆడాలంటే ఆడగలను. కానీ మళ్లీ నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయను. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం నా ఫిట్‌నెస్ కాదు.
ఇప్పటికీ నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాను. కానీ జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు నేను తప్పుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంగ్లండ్ క్రికెట్‌లోకి కొత్త తరం ఆటగాళ్లు రావాలని" అలీ పేర్కొన్నాడు.
ఇక ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న అలీ... ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ తరపున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అలీ.. వరుసగా 3,094, 2,355, 1,229 పరుగులు సాధించాడు. అదే విధంగా మూడు ఫార్మాట్లు కలిపి 254 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment