IPL 2022: Great News for CSK, Moeen Ali the Allrounder in Top Gear, Hits 4 Consecutive Sixes - Sakshi

చెన్నై అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. అత‌డు ఫామ్‌లోకి వ‌చ్చేశాడు... 7 సిక్స‌ర్ల‌తో విధ్వంసం!

Jan 30 2022 10:37 AM | Updated on Jan 30 2022 11:55 AM

Great news for CSK, Moeen Ali the allrounder in top gear, hits 4 consecutive SIXES - Sakshi

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్‌-2022 ముందు ఆ జ‌ట్టు స్టార్ ఆల్ రౌండ‌ర్ మోయిన్ అలీ అధ్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. కింగ్‌స్ట‌న్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మోయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 28 బంతుల్లో 63 ప‌రుగులు సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇన్నింగ్స్ 18 ఓవ‌ర్ వేసిన జాస‌న్ హోల్డ‌ర్ బౌలింగ్‌లో వ‌రుస‌గా నాలుగు సిక్స్‌ర్లు అలీ బాదాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జాస‌న్ రాయ్‌(52), మోయిన్ అలీ(63), విన్స్‌(34) ప‌రుగుల‌తో రాణించారు. విండీస్ బౌల‌ర‌ల్లో హోల్డ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక 194 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల కోల్పోయి 159 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. విండీస్ బ్యాట‌ర్ల‌లో కైల్ మేయర్స్(40), జాసన్ హోల్డర్(36) ప‌రుగుల‌తో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు.  ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో మోయిన్ అలీ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ర‌షీద్‌, లివింగ్‌స్టోన్ చెరో వికెట్ సాధించారు. ఇక 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జ‌ట్లు రెండు విజ‌యాల‌తో స‌మంగా నిలిచాయి. కాగా వెస్టిండీస్‌- ఇంగ్లండ్ మ‌ధ్య ఐదో టీ20 ఆదివారం జ‌ర‌గ‌నుంది. ఇక చెన్నైసూప‌ర్ కింగ్స్ విష‌యానికి వ‌స్తే.. ఐపీఎల్‌-2022 మెగా వేలంకు ముందు మోయిన్ అలీను రీటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

చ‌ద‌వండి: యార్క‌ర్‌తో వికెట్ ప‌డ‌గొట్టాడు.. అభిమానుల‌కు దండం పెట్టాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement