ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగుతున్న యాషెస్ తొలి టెస్టుతో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బంతితో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67 ఓవర్‌లో అలీ తొలి బంతిని ఔట్ సైడ్‌ఆఫ్ దిశగా వేశాడు.
ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా గ్రీన్ బిత్తిరిపోయాడు. చేశాదేమి లేక గ్రీన్‌నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గ్రీన్ 38 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మెయిన్ అలీని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసిచాడు. "వాటే ఏ బ్యూటీ మోయిన్" అంటూ.. గ్రీన్ ఔటైన వీడియోను భజ్జీ ట్విటర్‌లో షేర్ చేశాడు.
ఇక యాషెస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(137), కమ్మిన్స్ ఉన్నారు.
చదవండి: నేను బతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ఇంతకంటే దిగజారడం అంటే: మాజీ కెప్టెన్
What was that Moeen Ali.. 🥹#ENGvAUS #Ashes #Ashes23 pic.twitter.com/dATMqppgXQ
— Abu Zaid Sarooji (@Sarooji_) June 17, 2023
What a beauty Moen ♠️ https://t.co/Rai7KEj4XN
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2023
Comments
Please login to add a commentAdd a comment