
Courtesy: CSK Twitter
సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. వీసా సమస్యతో మొయిన్ అలీ సకాలంలో భారత్‌కు వచ్చే అవకాశాలు లేవు. దీంతో కేకేఆర్‌తో మ్యాచ్‌కు అతను దూరమవనున్నాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.
''ఫిబ్రవరి 28నే మొయిన్ అలీ ఇండియా వచ్చేందుకు వీసా అప్లికేషన్ పెట్టుకున్నాడు. 20 రోజులైనప్పటికి అతని వీసా అప్లికేషన్‌పై ఎలాంటి కదలిక లేదు. వాస్తవానికి మొయిన్ అలీ భారత్‌కు రెగ్యులర్‌గా వస్తుండేవాడు. ఎప్పుడు రాని వీసా సమస్య ఈసారి మాత్రమే ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. మేం కూడా ఇంగ్లండ్‌లోని భారతీయ ఎంబసీతో మాట్లాడమని.. మొయిన్ అలీ వీసా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నాం.
త్వరలోనే మొయిన్ అలీ జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం. బీసీసీఐ కూడా అలీ వీసా విషయమై ఆరా తీసిందని.. సోమవారం కల్లా అతనికి వీసా పేపర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇండియాకు వచ్చినప్పటికి మూడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి కాబట్టి అలీ కేకేఆర్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడు.'' అంటూ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
కాగా ఇప్పటికే తొలి మ్యాచ్‌కు రుతురాజ్ దూరం కాగా.. గాయంతో దీపక్ చహర్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. తాజాగా మొయిన్ అలీ కేకేఆర్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఆల్‌రౌండర్‌ను మెగావేలానికి ముందు రూ. 8 కోట్లతో సీఎస్‌కే రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 26న ఆరంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్‌లో తొలి మ్యాచ్ సీఎస్‌కే, కేకేఆర్ మధ్య వాంఖడే వేదికగా జరగనుంది.
చదవండి: IPL 2022: ఒకప్పుడు అత్యధిక వికెట్ల వీరుడు.. ఇప్పడు నెట్‌బౌలర్‌గా.. షాకింగ్!