Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు సీఎస్కేకు భారీ ఊరట లభించింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. భారత్‌కు చేరుకున్నాక అతడు నేరుగా జట్టుతో కలిశాడు. వీసా సమస్య కారణంగా అతడు భారత్‌కు చేరుకోవడంలో జాప్యం చోటు చేసుకుంది. కాగా అతడు చెన్నై జట్టు శిబిరంలో చేరినప్పటికి కేకేఆర్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందకుంటే అతడు మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు.
ఇక గత ఏడాది సీజన్‌లో టైటిల్ చెన్నై టైటిల్ గెలవడంలో అలీ కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడు తొలి మ్యాచ్‌కు దూరం కావడం చెన్నైకు పెద్ద ఎదుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకుని అందరినీ షాక్ గురి చేశాడు. కాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్కే పగ్గాలు చేపట్టాడు. అదే విధంగా సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 26న(శనివారం) వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది.
సీఎస్కే జట్టు: రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, దీపక్ చాహర్, కెఎమ్ ఆసిఫ్, తుషార్ దేశ్‌పాండే, కెఎమ్ ఆసిఫ్, శివమ్ దూబే, మహేశ్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్, డి సమర్జీత్ సింగ్, డి. , డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, ఆడమ్ మిల్నే, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సి హరి నిశాంత్, ఎన్ జగదీసన్, క్రిస్ జోర్డాన్, కె భగత్ వర్మ
చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment