ముంబై: తాను ఆల్కహాల్ లోగో ఉన్న జెర్సీలను ధరించనంటూ సీఎస్‌కే ఆటగాడు మొయిన్ అలీ చేసిన రిక్వస్ట్‌కు ఆ ఫ్రాంచైజీ ఒప్పుకున్నట్లు నిన్నంతా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఇండియా టుడే కాశీ విశ్వనాథన్‌ను కలవగా ఆయన అది వాస్తవం కాదని పేర్కొన్నారు.
‘మొయిన్ అలీ లోగో అంశంపై మీడియా రిపోర్ట్‌లో ఏదైతే వచ్చిందో అందులో వాస్తవం లేదు. అసలు మొయిన్ అలీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి రిక్వస్ట్ చేయలేదు’ అని తెలిపారు. తన జెర్సీపై ఆల్కాహాల్ కంపెనీ అయిన ఎస్‌ఎన్‌జే 10000 లోగోను మొయిన్ తీశాయమన్నాడని జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. స్వతహాగా ఆల్కహాల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి మొయిన్ అలీ ఇష్టపడని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎస్‌కేను కూడా రిక్వస్ట్ చేసే ఉంటాడనేది వార్తల్లోని సారాంశం. కాగా, దీన్ని సీఎస్‌కే ఖండించడంతో లోగో అంశంపై అలీ ఎటువంటి విజ్ఞప్తి చేసుకోలేదనేది అర్థమైంది. జెర్సీలను ధరించడంలో ఎటువంటి మినహాయింపు లేకుండా మిగతా క్రికెటర్లు మాదిరే దాన్ని ధరిస్తాడనే విశ్వనాథన్ మాటల ద్వారా తేలిపోయింది.
ఇక సీఎస్‌కే వెబ్‌సైట్‌లో మొయిన్ అలీ మాట్లాడుతూ.. నేను మా ఫ్రాంచైజీ ఆటగాళ్లతో ఎక్కువగా మాట్లాడుతూ వారి ప్రదర్శన గురించి ఎక్కువగా చర్చిస్తున్నా. నేను ఒక గొప్ప కెప్టెన్ అనే విషయాన్ని నేను నమ్ముతా. ధోని కెప్టెన్సీలో ఆడుతున్నామంటే గ్యారంటీగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దానికదే వచ్చేస్తుంది. అటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు ధోని. ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడటం నాకు తెలియన అనుభూతిని తీసుకొచ్చింది’ అని పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో మొయిన్ అలీని రూ. 7కోట్లు పెట్టి సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అలీని సీఎస్‌కే దక్కించుకుంది. గత మూడు సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతూ వస్తున్న మొయిన్ అలీని ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. దాంతో వేలంలోకి రాగా సీఎస్‌కే దక్కించుకుంది. ఏప్రిల్10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సీఎస్‌కే తలపడనుంది.
ఇక్కడ చదవండి: పొలార్డ్‌ను మరిపిస్తున్నాడు.. ఆ సాహసం చేయలేను: కుంబ్లే
Comments
Please login to add a commentAdd a comment