CSK VS MI: అప్పుడు అర్థ సెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్‌లు | IPL 2021: CSK Top Order Duck Out Vs Mumbai Indians Netigens Trolls Viral | Sakshi
Sakshi News home page

CSK VS MI: అప్పుడు అర్థ సెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్‌లు

Published Sun, Sep 19 2021 8:13 PM | Last Updated on Sun, Sep 19 2021 8:45 PM

IPL 2021: CSK Top Order Duck Out Vs Mumbai Indians Netigens Trolls Viral - Sakshi

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌కు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్‌ 2020 సీజన్‌ను గుర్తు చేస్తూ సీఎస్‌కే దారుణ ఆటతీరును కనబరుస్తుంది. 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఇక బ్యాట్స్‌మన్‌కు వచ్చిన విచిత్ర పరిస్థితి విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్‌ ఢిల్లీ వేదికగా జరిగింది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్‌ 50, మొయిన్‌ అలీ 58, అంబటి రాయుడు 72 పరుగులతో రాణించారు. కాగా తాజా మ్యాచ్‌లో మాత్రం ఈ ముగ్గురు సున్నా పరుగులకే వెనుదిరిగారు. ఇందులో డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ డకౌట్‌లు కాగా.. రాయుడు సున్నా పరుగుల వద్దే దురదృష్టవశాత్తూ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.  దీనిపై అభిమానులు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు. అప్పుడు అర్థసెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్‌లు అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం సీఎస్‌కే 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. రుతురాజ్‌ (17), జడేజా(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: Glenn Maxwell: సూపర్‌ ఓవర్‌ టై.. మ్యాక్స్‌వెల్‌ క్లీన్‌బౌల్డ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement