79 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ బౌలర్‌కు హ్యాట్రిక్ .
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
లండన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అలీ హ్యాట్రిక్ వికెట్ పడగొట్టడంతో ఈ ఫీట్ సాధించిన 13 వ ఇంగ్లీష్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అలీ హ్యాట్రిక్‌తో ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా పై 239 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఓవల్ వేదికపై జరిగిన ఈ వందో టెస్టును స్పిన్నర్ మొయిన్ అలీ (4/45) హ్యాట్రిక్‌తో ముగించడం విశేషం. ఇన్నింగ్స్ 76వ ఓవర్ చివరి రెండు బంతులకు ఎల్గర్, రబడా (0)లను ఔట్ చేసిన మొయిన్ అలీ తన తర్వాతి ఓవర్ తొలి బంతికి మోర్నీ మోర్కెల్ (0)ను ఔట్ చేసి తన ఖాతాలో హ్యాట్రిక్ వేసుకున్నాడు. వంద టెస్టుల ఓవల్ గ్రౌండ్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా... 79 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్ తీసిన మొదటి హ్యాట్రిక్ కూడా ఇదే కావడం మరో విశేషం.