యాషెస్ తొలి టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టుకు అన్ని విధాల సన్నద్దం అవుతోంది. రెండో టెస్టు జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. అయితే రెండో టెస్టుకు ఇంగ్లీష్ జట్టు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆడేది సందేహం గా మారింది. తొలి టెస్టులో మోయిన్ అలీ చేతి వేలి గాయంతో బాధపడ్డాడు.
దీంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో పెద్దగా అలీ బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలో రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టు మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. మోయిన్ అలీ బ్యాకప్‌గా యువ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. కాగా 18 ఏళ్ల అహ్మద్.. గతేడాది డిసెంబర్‌లో పాకిస్తాన్‌పై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు.
ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్టులోనే ఏడు వికెట్లు పడగొట్టి అందరని రెహాన్ అకట్టుకున్నాడు. ప్రస్తుతం విటిలిటి టీ20 బ్లాస్ట్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న రెహాన్ పర్వాలేదనపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అలీ బ్యాకప్‌గా ఈయువ లెగ్గీని ఎంపిక చేశారు.
చదవండి: Shayan Jahangir: 'కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. ఎదురుచూస్తున్నా'
Comments
Please login to add a commentAdd a comment