ఇంగ్లండ్‌తో టెస్ట్‌: ఓటమి అంచుల్లో భారత్‌ | India Loss Virat Kohli Wicket Agianst England | Sakshi
Sakshi News home page

Sep 2 2018 8:17 PM | Updated on Sep 2 2018 9:36 PM

India Loss Virat Kohli Wicket Agianst England - Sakshi

విరాట్‌ కోహ్లి

మ్యాచ్‌ మనవైపు వచ్చిందనుకునే తరుణంలో మొయిన్‌ అలీ దెబ్బతీశాడు..

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఎనిమిదో వికెట్‌ను. అంతకు ముందు రహానే (51) ను రూపంలో ఏడో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్‌ చేస్తుడడంతో భారత ఆటగాళ్లు వరసగా పెవీలియన్‌కు క్యూ కడుతున్నారు.  గడ్డు పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కోహ్లి మరోసారి అపద్భాందవ పాత్ర పోషించాడు. ఆచితూచి ఆడుతూ 114 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేతో కలిసి గట్టెక్కించాడు. ఈ తరుణంలో మొయిన్‌ అలీ కోహ్లి(58)ని ఔట్‌ చేసి గట్టి దెబ్బకొట్టాడు. దీంతో నాలుగో వికెట్‌ నమోదైన 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  మ్యాచ్‌ మనవైపు వచ్చిందనుకునే తరుణంలో మొయిన్‌ అలీ కోహ్లి వికెట్‌తో దెబ్బతీశాడు. భారత్‌ గెలుపుకు ఇంకా 91 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 271 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన స్వల్ప ఆధిక్యంతో భారత్‌కు 245 పరుగుల సాధారణ లక్ష్యం ఎదురైంది. ఈ లక్ష్య చేధనలో భారత బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. ఓపెనర్లు రాహుల్‌(0), ధావన్‌ (17)లు నిరాశ పరిచారు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీతో ఆకట్టుకున్న పుజారా(5) ఈ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. దీంతో భారత్‌ 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement