
అహ్మదాబాద్: టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్లతో ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. జేసన్ రాయ్ 49 పరుగులతో రాణించగా.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' జోఫ్రా ఆర్చర్ కీలక మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆర్చర్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ విజయం అనంతరం.. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కంగ్రాట్స్ చెప్పుకుంటున్నారు.
ఇంతలో అదిల్ రషీద్ వద్దకు వచ్చిన ఆర్చర్ అతన్ని హగ్ చేసుకొని కంగ్రాట్స్ చెప్పాడు. రషీద్ వెనుకే ఉన్న మొయిన్ అలీ కూడా ఆర్చర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే ఆర్చర్ మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ అలీని పట్టించుకోలేదు.. దీంతో మైండ్ బ్లాంక్ అయిన అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ చర్య సోషల్ మీడియాలో ఆసక్తి కలిగించింది. తుది జట్టులో రషీద్‌కు చోటు దక్కడంతో తొలి టీ20లో అలీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం తమదైశ శైలిలో కామెంట్లు చేశారు. ఆర్చర్, అలీ మధ్య విభేదాలు ఉన్నాయని.. అందుకే ఆర్చర్ అలీని పట్టించుకోలేదని.. ఇద్దరి మధ్య ఏవేనై పాత గొడవలున్నాయేమో అంటూ పేర్కొన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) జరగనుంది.
చదవండి:
పంత్ కళ్లు చెదిరే సిక్స్.. ఈసారి ఆర్చర్ వంతు
సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం
Ouch pic.twitter.com/IOWFIW3Z1g
— Maara (@QuickWristSpin) March 12, 2021
Comments
Please login to add a commentAdd a comment